లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన బీసీ సంక్షేమ శాఖ సహాయ అధికారి

1242చూసినవారు
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన బీసీ సంక్షేమ శాఖ సహాయ అధికారి
కదిరి పట్టణంలో బీసీ సంక్షేమ శాఖ సహాయ అధికారి బాలాజీ గురువారం పాత బకాయిల బిల్లుల మంజూరు కోసం వార్డెన్ లక్ష్మీనారాయణ నుంచి రూ. 15 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. ఏసీబీ సీఐ హమీద్ ఖాన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆపరేషన్‌లో బాలాజీని అరెస్ట్ చేసి, కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఏసీబీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్