తలుపుల: సీఎం పర్యటన ఏర్పాట్లు

నవంబర్ 1న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కదిరి నియోజకవర్గం తలుపుల మండలం పెద్దన్న గారి పల్లికి వస్తున్న నేపథ్యంలో, జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. శుక్రవారం ఆయన గ్రామాన్ని సందర్శించి, సీఎం పర్యటన సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నారు.
