తనకల్లు మండలం గందోడివారిపల్లికి చెందిన రైతు రెడ్డప్ప రెడ్డి రోడ్డు ప్రమాదంలో మరణించారు. టమాటా సాగు చేసేందుకు ఆయన అన్నమయ్య జిల్లా పీటీఎంలో వంగడాలు కొనుగోలు చేశారు. తిరుగు ప్రయాణంలో కారు ఢీకొనడంతో అపస్మారక స్థితికి చేరుకున్నారు. స్థానికులు మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వైద్యులు ఆయన మృతి చెందినట్లు నిర్ధారించారు.