రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, కదిరిలోని STSN ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో మే 1న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు అధికారి హరికృష్ణ తెలిపారు. ఈ మేళాలో 10 ప్రముఖ కంపెనీలు పాల్గొంటాయని, టెన్త్ నుంచి పీజీ వరకు చదివిన 18-35 ఏళ్ల యువతీ యువకులు అర్హులని ఆయన పేర్కొన్నారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఆసక్తి గల వారు నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.