ఈ రోజు ఉదయం 10 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీసత్యసాయి జిల్లాలో పర్యటించనున్నారు. కదిరి నియోజకవర్గం, తలుపుల మండలం, పెద్దన్నవారి పల్లెలో జరిగే పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. అనంతరం, అదే రోజు రాత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు హైదరాబాద్‌కు తిరిగి చేరుకుంటారు. ఈ పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను జిల్లా అధికారులు ఇప్పటికే చేపట్టారు.