కదిరి: గుట్టను ఢీకొన్న లారీ.. ఒకరి మృతి

2554చూసినవారు
కదిరి: గుట్టను ఢీకొన్న లారీ.. ఒకరి మృతి
మూర్తిపల్లి సమీపంలో బాహ్యవలయ రహదారిపై సిమెంట్ లారీ అదుపుతప్పి గుట్టను ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా, మరో ముగ్గురికి గాయాలయ్యాయి. కదిరి నుంచి పులివెందుల వైపు వెళ్తున్న లారీ అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న గుట్టను ఢీకొంది. వాహనం నడుపుతున్న సాధిక్ (24) మృతి చెందారు. ఈ ప్రమాదంలో రహీం, సలీం, ఈదుల్లా గాయపడ్డారు. స్థానికులు గాయపడిన వారిని కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, తీవ్రంగా గాయపడిన రహీంను అనంతపురం తరలించారు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేస్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్