కదిరి ఎమ్మెల్యే కందికుంటకు మక్బుల్ సవాల్

732చూసినవారు
వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జగన్‌ను విమర్శించే స్థాయి కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్‌కు లేదని నియోజకవర్గ వైసీపీ ఇన్‌ఛార్జి మక్బుల్ మండిపడ్డారు. కదిరిలో ఆయన మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన నుంచి మీరు చేసిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. ఐదేళ్లలో తాము చేసిన పనులను వివరిస్తామన్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, విమర్శలు మానుకుని ప్రజలకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్