తనకల్లు: తేనెటీగల దాడిలో ఒకరి మృత్యువాత

2చూసినవారు
తనకల్లు: తేనెటీగల దాడిలో ఒకరి మృత్యువాత
అన్నమయ్య జిల్లా బి.కొత్తకోటలో శనివారం తేనెటీగల దాడిలో తనకల్లులోని ఇందిరా నగర్ కు చెందిన రామాంజులు (34) అనే యువకుడు మృతిచెందాడు. తన అత్తారింటికి పిల్లలను వదిలి వెళ్తున్న సమయంలో గ్రామ సమీపంలో తేనెటీగలు దాడి చేయడంతో, భయపడి బావిలో దూకిన రామాంజులు ఈత రాక మరణించాడు. కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించే రామాంజులు మృతితో అతని భార్య స్వప్న, కుమారుడు రాజేంద్ర (7), కుమార్తె గనశ్రీ (3) అనాథలయ్యారు.

సంబంధిత పోస్ట్