పెట్రోల్ కొరత లేకున్నా బంకుల వద్ద వాహనాల క్యూ

588చూసినవారు
పెట్రోల్ కొరత లేకున్నా బంకుల వద్ద వాహనాల క్యూ
కదిరి పట్టణంలో పెట్రోల్ కొరత లేదని తహశీల్దార్ రాజశేఖర్ స్పష్టం చేసినప్పటికీ, సోమవారం వాహనదారులు పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరారు. ద్విచక్ర వాహనదారులు ముందు జాగ్రత్త చర్యగా అధిక మొత్తంలో పెట్రోల్ నింపుకుంటున్నారు. పెట్రోల్ బంకుల వద్ద రద్దీ పెరుగుతుందని నిర్వాహకులు తెలిపారు.

సంబంధిత పోస్ట్