కదిరి - Kadiri

కదిరి: బాలికలను భయభ్రాంతులకు గురిచేసిన వ్యక్తి అరెస్టు

కదిరి: బాలికలను భయభ్రాంతులకు గురిచేసిన వ్యక్తి అరెస్టు

కదిరి పట్టణంలోని అడపాల వీధిలో ఉన్న బాలికల గురుకుల పాఠశాలలోకి అక్రమంగా ప్రవేశించి బాలికలను భయభ్రాంతులకు గురిచేసిన వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు సోమవారం కదిరి టౌన్ సీఐ నారాయణ రెడ్డి తెలిపారు. ఈ నెల 4వ తేదీ రాత్రి కమ్మరోల్లపల్లి గ్రామానికి చెందిన ఎర్ల మహేష్ అనే వ్యక్తి హాస్టల్లోకి చొరబడి, సెక్యూరిటీ గార్డును కర్రతో బెదిరించి పారిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు, మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో మహేష్ ను కమ్మరోల్లపల్లి గ్రామ శివారులో అరెస్టు చేశారు. కదిరి మెజిస్ట్రేట్ అతనికి 14 రోజుల రిమాండ్ విధించడంతో సబ్ జైల్ కు తరలించారు.

వీడియోలు


కామారెడ్డి జిల్లా