కంబదూరు మండలం కురాకులపల్లి గ్రామానికి చెందిన మంజునాథ్ అనే రైతు ఆర్థిక ఇబ్బందులతో శుక్రవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. స్థానికులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. రైతు తన 5ఎకరాల పొలంలో టమోటా సాగు చేస్తున్నాడు. ఇటీవల అకాల వర్షాల వల్ల కొన్ని పంటలు నష్టపోయారు. దీంతో అప్పు మరింత పెరిగి, వడ్డీలు కట్టలేక మనస్థాపంతో పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.