శెట్టూరు మండలం చిన్నంపల్లి గ్రామ శివారులో రైతు వెంకటేశులుకు చెందిన గేదె దూడపై చిరుత దాడి చేసి చంపేసింది. ఈ ఘటన బుధవారం తెల్లవారు జామున జరిగిందని స్థానికులు తెలిపారు. వెంకటేశులు గ్రామ శివారులో పశువుల పాక వేసి అక్కడ పశువులను ఉంచాడు. ఈ క్రమంలో అడవిలో నుంచి వచ్చిన చిరుత గేదె దూడపై దాడి చేసి చంపిందన్నాడు. బాధిత రైతు అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేశాడు.