
కళ్యాణదుర్గం: అడుగంటిన భూగర్భ జలాలు - ఎండుతున్న పంటలు
కుందుర్పి మండలంలో తీవ్ర వర్షాభావం కారణంగా వాగులు, వంకలు, చెరువులు ఎండిపోయాయి. భూగర్భజలాలు అడుగంటిపోవడంతో బోరుబావుల్లో నీరు రోజురోజుకు తగ్గిపోతోంది. 800 అడుగుల లోతు బోరు తవ్వించినా నీరు రావడం లేదని, నీటి తడులు అందక పంటలు ఎండిపోతున్నాయని సోమవారం రైతులు తెలిపారు. చాలామంది రైతులు వ్యవసాయం మానేసి కూలీ పనులకు వెళ్తున్నారు.








































