
మడకశిర సమీపంలో ఎలుగుబంటి సంచారం
గురువారం కదిరేపల్లి సమీపంలోని భూతప్ప అటవీ ప్రాంతంలో ఎలుగుబంటి సంచరించినట్లు స్థానికులు తెలిపారు. అడవికి వెళ్లిన కొందరు యువకులకు ఎలుగుబంటి కనిపించడంతో, ఆ ప్రాంత రైతులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. అటవీ శాఖ అధికారులు తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.



































