రొళ్ల మండలం ఎం రాయపురం పంచాయితీ కేంద్రంలో సోమవారం, మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి ఆధ్వర్యంలో వైసిపి, కాంగ్రెస్ పార్టీలకు చెందిన 20 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరాయి. వారికి పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, యువ నాయకులు నారా లోకేష్ ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, పరిశ్రమల రాకతో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని, రైతులకు హంద్రీనీవా కాలువ ద్వారా సాగునీరు అందుతుందని తెలిపారు. ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని, టిడిపిలో చేరిన వారు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు.