అగళి : లిక్కర్ మాఫియా ఈరలక్కప్పకు మాట్లాడే అర్హత లేదు

6చూసినవారు
అగళి : లిక్కర్ మాఫియా ఈరలక్కప్పకు మాట్లాడే అర్హత లేదు
సత్య సాయి జిల్లా మడకశిర వైసీపీ సమన్వయ కర్త ఈరలక్కప్ప సొంత మండలం గుడిబండలో అక్రమంగా కర్ణాటక లిక్కర్  లిక్కర్ మాఫియా చేసి కేసులు కట్టించుకున్న నువ్వు ప్రస్తుతం మడకశిర ను అభివృద్ధి చేస్తున్న ఎం ఎస్ రాజు పై మాట్లాడే అర్హత లేదని సోమవారం అగళి టీడీపీ జడ్పీటీసీ ఉమేష్ తో పాటు టీడీపీ నాయకులు ఘాటుగా విమర్శలు చేశారు. గత ప్రభుత్వం వైసీపీ హయాంలో మీ ఎమ్మెల్యే తరహాలో మా ఎమ్మెల్యే అవినీతితో అక్రమ వసూళ్లు చేసి డబ్బు సంపాదించలేదన్నారు. మడకశిర ను అభివృద్ధి చేయకుండా నిత్యం దోచుకుతిన్నది అందరికి తెలుసు అన్నారు. నోరు అదుపులో ఉంచుకుని మాట్లాడాలని హె చ్చరించారు

సంబంధిత పోస్ట్