అగళి : కే జీ బీ వీ బాలికల పాఠశాల తనిఖీ చేసిన ఎం ఈ ఓ
అగళి మండల కేంద్రంలోని కేజీబీవీ బాలికల పాఠశాలను ఎంఈఓ చంద్రశేఖర్ నాయుడు శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన టెన్త్ విద్యార్థులను పరిశీలించి మెరుగైన ఉత్తీర్ణత సాధించడానికి విద్యార్థులు ఇష్టంతో కష్టపడి చదవాలని, ఉపాధ్యాయులు కూడా ప్రత్యేక తరగతులు నిర్వహించి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. తనిఖీ సమయంలో ఎస్ఓ నాగరత్న కూడా ఉన్నారు.