తక్కువ నీటితో సాగయ్యే పంటలు వేయాలి.. వ్యవసాయ అధికారి

4చూసినవారు
తక్కువ నీటితో సాగయ్యే పంటలు వేయాలి.. వ్యవసాయ అధికారి
మడకశిరలోని అగళి మండలంలో ఎల్ నినో ప్రభావంపై రైతులకు, మహిళా సంఘ సభ్యులకు అవగాహన కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. మండల వ్యవసాయ అధికారి నాగరాజు మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని తక్కువ నీటితో సాగయ్యే పంటలు, కిచెన్ గార్డెన్ సాగు చేయాలని సూచించారు. బీడు భూముల్లో ఉలవలు, రాయితీపై ఇస్తున్నందున వాటిని వేయాలని, రాబోయే రబీ సీజన్లో చిరుధాన్యాల సాగును ప్రోత్సహించాలని, చియాసిడ్స్ ను సాగు చేయాలని, వివిధ పంటలలో పాటించవలసిన పద్ధతులను తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఉద్యానవన అధికారి ఉదయ్ కుమార్ నాయుడు కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్