2946 విద్యార్థులకు విద్యా కానుక కిట్లు పంపిణీ

6చూసినవారు
2946 విద్యార్థులకు విద్యా కానుక కిట్లు పంపిణీ
శ్రీసత్యసాయి జిల్లా, అగళి మండలంలో 2026 మే 20 నుండి జూలై 6 వరకు 48 రోజుల పాటు 2946 మంది విద్యార్థులకు విద్యా కానుక కిట్ల పంపిణీ విజయవంతంగా పూర్తయింది. ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో చదువుతున్న ఈ విద్యార్థులకు టెక్స్ట్ బుక్స్, వర్క్ బుక్స్, నోట్ బుక్స్, బ్యాగ్స్, షూస్, యూనిఫామ్, బెల్ట్స్, సాక్స్, ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీ, పిక్టోరియల్ డిక్షనరీతో సహా 10 రకాల వస్తువులను అందించినట్లు ఎంఈఓ చంద్రశేఖర్ నాయుడు సోమవారం తెలిపారు. ఈ పంపిణీ కార్యక్రమంలో ఎంఆర్‌సీ సిబ్బంది కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్