మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి ఆశీస్సులు ప్రజలకు

753చూసినవారు
మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి ఆశీస్సులు ప్రజలకు
మడకశిర పట్టణంలోని 1వ వార్డు శివాపురంలో జరిగిన ఏడుగురు అక్కమ్మ గార్ల సమారాధన కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి పాల్గొన్నారు. ఆయన ప్రత్యేక పూజల్లో పాల్గొని, అమ్మవారి ఆశీర్వాదాలు పొందారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులతో మాట్లాడి, ప్రజలందరూ సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్