అగళి ఆదర్శ పాఠశాలలో గాంధీ జయంతి ఘనంగా నిర్వహణ

7చూసినవారు
అగళి ఆదర్శ పాఠశాలలో గాంధీ జయంతి ఘనంగా నిర్వహణ
మడకశిరలోని అగళి ఆదర్శ పాఠశాలలో జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా క్విజ్, వక్తృత్వ, వ్యాసరచన పోటీలు నిర్వహించి విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఆదర్శ పాఠశాల స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులు, ఉపాధ్యాయులు మహాత్ముడి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖాధికారులు నాగేంద్ర, చంద్రశేఖర్ నాయుడు, ప్రిన్సిపాల్ సి.హెచ్. విజయ కుమారి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్