మల్లినమడుగులో ఉపాధి పనులపై గ్రామసభ, అభివృద్ధికి ప్రణాళిక

6చూసినవారు
మల్లినమడుగులో ఉపాధి పనులపై గ్రామసభ, అభివృద్ధికి ప్రణాళిక
రొళ్ల మండలం మల్లినమడుగు గ్రామంలో 2027-28 ఆర్థిక సంవత్సరానికి గాను శుక్రవారం వీబిజి రామజీ పథకం కింద చేపట్టబోయే ఉపాధి పనులను గుర్తించడానికి గ్రామసభ నిర్వహించారు. రైతుల పొలాల్లో ఇంకుడు గుంతల నిర్మాణం, పంట కాలువల తవ్వకం, చెక్ డ్యామ్ ల నిర్మాణం, పండ్ల తోటల పెంపకం, మట్టి రోడ్లు, సీసీ రోడ్ల నిర్మాణం, చెరువుల్లో పూడిక తీత, భూగర్భ జలాలు పెంపు వంటి పనులపై చర్చించారు. ఈ గ్రామసభలో అధికారులు, రైతులు, కూలీలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్