అగళి మండలం కరిదాసనపల్లిలో వంట చేస్తున్న సమయంలో పొయ్యి నుంచి ఎగసిపడ్డ నిప్పు రవ్వలు ఎండిన కొబ్బరి ఆకులకు అంటుకోవడంతో రవికుమార్ ఇల్లు ప్రమాదవశాత్తు కాలిపోయింది. ఈ ఘటనలో ఇంట్లోని సామగ్రి మొత్తం బూడిద కావడంతో బాధితుడు కన్నీరుమున్నీరయ్యాడు. కట్టుబట్టలతో మిగిలిపోయిన తనను ప్రభుత్వం ఆదుకుని, ఇల్లు నిర్మించి ఇవ్వాలని ఆయన కోరారు.