అగళి అంగన్వాడీల్లో ఐసీడీఎస్ పోషణ్ మాసోత్సవాలు

0చూసినవారు
అగళి అంగన్వాడీల్లో ఐసీడీఎస్ పోషణ్ మాసోత్సవాలు
సత్య సాయి జిల్లా అగళి మండలంలో గల రెండు సెక్టార్ పరిధిలో వున్న అంగనవాడి కార్యకర్తలకు గురువారం సీడీపీఓ ఆదేశాలు మేరకు పోషణ మాషోత్సవాలు, అంగన్వాడీ ఉత్సవం కార్యక్రమంలో సెక్టర్ మీటింగ్ జరిగింది. స్థానిక ఎస్ ఐ, ఎం ఈ ఓ, ఐ సి డి స్ సూపెర్వైజర్ హాజరై, ప్రధాన మంత్రి మాతృ వందన యోజన, THR, గ్రోత్ మానిట్రింగ్, ప్రీ స్కూల్ విద్య, పోషణ అభియాన్ సేవలతో పాటు సమతుల్య ఆహారం, తల్లిపాల ప్రాముఖ్యత, పిల్లల ఆరోగ్యం, బాల్యవివాహం, పోషణ పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి మండలంలో ఉన్న అందరు అంగనవాడి కార్యకర్తలు, అగళి 3 కేంద్రం పరిధిలో ఉన్న తల్లులు హాజరయ్యారు.

సంబంధిత పోస్ట్