శ్రీసత్యసాయి జిల్లా, గుడిబండ మండలం ఎంజేపీ బాలికల గురుకుల పాఠశాలలో మంగళవారం, ప్రిన్సిపాల్ వరలక్ష్మి ఆదేశాల మేరకు నిర్వహించిన ఎస్ఎంసీ ఎన్నికల్లో శంకరగల్లు జగదీష్ చైర్మన్ గా, గీతంజలి వైస్ చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గత ఏడాది కూడా విద్యాభివృద్ధికి కృషి చేసిన జగదీష్ ను రెండవసారి తిరిగి ఎన్నుకున్నారు. అనంతరం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆయనను సన్మానించారు.