చిరుత సంచారం.. భయం గుప్పిట్లో ప్రజలు

267చూసినవారు
చిరుత సంచారం.. భయం గుప్పిట్లో ప్రజలు
శ్రీ సత్యసాయి జిల్లా అగళి మండలం నర్సాంబూది పొలిమేర, వడ్నమ్మ గుడి సమీపంలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. పొలం పనులకు వెళ్లే రైతులు చిరుతను చూసి భయంతో ఇళ్లకు పరుగులు తీశారు. ఒంటరిగా వెళ్లే సమయంలో చిరుత కనిపిస్తుండటంతో ప్రజలు ప్రాణభయంతో వణికిపోతున్నారు. అటవీ శాఖ అధికారులు వెంటనే స్పందించి చిరుతను బంధించాలని స్థానికులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్