శ్రీసత్యసాయి జిల్లా, మడకశిర మండలం మధు డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 9వ తరగతి విద్యార్థి ఎన్. లోకేష్ అండర్ 17 జూనియర్ అనంతపురం జిల్లా సాఫ్ట్ బాల్ జట్టుకు ఎంపికయ్యాడు. ఈనెల 11, 12, 13 తేదీలలో కడప జిల్లా పుల్లంపేటలో జరగనున్న అండర్ 17 జూనియర్ అనంతపురం జిల్లా సాఫ్ట్ బాల్ పోటీలలో లోకేష్ పాల్గొంటాడు. అతని ఎంపికపై ప్రధానోపాధ్యాయుడు ప్రభు రాజ్, వ్యాయామ ఉపాధ్యాయుడు శివకుమార్ సంతోషం వ్యక్తం చేశారు. పాఠశాల ఉపాధ్యాయులు,
విద్యార్థులు లోకేష్ ను బుధవారం అభినందించారు.