శ్రీసత్యసాయి జిల్లా మడకశిరలోని శంకర్‌నగర్‌లో సోమవారం విషాదకర సంఘటన చోటు చేసుకుంది. మంచినీటి సంపు నిండి రోడ్డుపైకి నీరు వృథాగా పోతుండటంతో, గేట్ వాల్వ్ బంద్ చేయడానికి ప్రయత్నించిన లలితమ్మ (54) కాలు జారి సంపులో పడి మృతి చెందింది. కుటుంబసభ్యులు ఆమెను వెలికితీశారు. లలితమ్మకు భర్త, కుమారుడు, కుమార్తె ఉన్నారు.