పేద మహిళకు ఎమ్మెల్యే చేయూత: రూ. 20 వేల ఆర్థిక సాయం

2478చూసినవారు
పేద మహిళకు ఎమ్మెల్యే చేయూత: రూ. 20 వేల ఆర్థిక సాయం
శ్రీసత్యసాయి జిల్లా, మడకశిర పట్టణానికి చెందిన రామాంజనమ్మ అనే పేద మహిళకు చేతికి ఇన్ఫెక్షన్ రావడంతో హిందూపురంలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజు దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లగా, ఎమ్మెల్యే వెంటనే స్పందించి, వైద్యులతో మాట్లాడి మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. అనంతరం, వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రామాంజనమ్మ కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజు చేతుల మీదుగా రూ. 20 వేల ఆర్థిక సాయం అందజేశారు.

సంబంధిత పోస్ట్