రొళ్లలో రీసర్వే పనులను పరిశీలించిన ఆర్డీఓ

4చూసినవారు
రొళ్లలో రీసర్వే పనులను పరిశీలించిన ఆర్డీఓ
మడకశిర డివిజన్, రొళ్ల మండలంలోని రత్నగిరి గ్రామంలో నాన్-సిగ్నల్ ప్రాంతాల్లో నిర్వహిస్తున్న రీసర్వే గ్రౌండ్ ట్రూతింగ్ ప్రక్రియను ఆర్డీఓ నాగప్రసన్న లక్ష్మీ బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా రీసర్వేలో భాగంగా చేపడుతున్న గ్రౌండ్ ట్రూతింగ్ పనుల పురోగతిని, క్షేత్రస్థాయిలో చేపడుతున్న సర్వే ప్రక్రియను మరియు సంబంధిత రికార్డులను ఆమె పరిశీలించారు. రీసర్వే పనులను నిర్ణీత విధానాల ప్రకారం, పారదర్శకంగా మరియు వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత సిబ్బందికి ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో రొళ్ల తహసీల్దార్ కె. ఆర్. చంద్రశేఖర్ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్