మడకశిరలో రోడ్డు ప్రమాదం.. ఒకరికి స్వల్ప గాయాలు
శ్రీసత్యసాయి జిల్లా మడకశిర పట్టణం చీపులేటి బస్టాండ్ వద్ద మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనాన్ని బొలెరో గూడ్స్ వాహనం ఢీకొంది. ఈ ఘటనలో ఒక వ్యక్తి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.