గుడ్డుగురికి గ్రామంలో ఎఫ్ పీ షాప్ తనిఖీ

1చూసినవారు
గుడ్డుగురికి గ్రామంలో ఎఫ్ పీ షాప్ తనిఖీ
రొళ్ల మండలంలోని గుడ్డుగుర్కి గ్రామంలో ఉన్న ఫెయిర్ ప్రైస్ షాప్ నెం. 14ను తహసీల్దార్ చంద్రశేఖర్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. షాప్ లో బియ్యం, చక్కెర మాత్రమే నిల్వ ఉన్నట్లు గుర్తించారు. స్టాక్ రిజిస్టర్లు, పంపిణీ వివరాలు, ఈ-పాస్ యంత్రం ద్వారా జరుగుతున్న లావాదేవీలను పరిశీలించారు. అర్హులకు సకాలంలో, పూర్తి పరిమాణంలో సరుకులు పంపిణీ చేయాలని, స్టాక్ రికార్డులను పారదర్శకంగా నిర్వహించాలని డీలర్ కు సూచించారు. ఈ తనిఖీలో సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.