శ్రీసత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలోని ఐదు మండలాల పరిధిలో విధులు నిర్వహిస్తున్న వీఆర్ఏలు, తమ డిమాండ్ల సాధన కోసం మంగళవారం మడకశిర ఆర్డీఓ కార్యాలయంలో ఏడవ రోజు సమ్మెలో భాగంగా ఆర్డీఓ అధికారులకు వినతి పత్రం అందించారు. రాష్ట్ర వీఆర్ఏల జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు ఈ నిరసన చేపట్టారు.