వీబి జి రామ్ జి పనులు ప్రారంభం
అగళి మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలలో వీబీజీ రామ్ జీ పనులు పండుగ వాతావరణంలో ప్రారంభమయ్యాయి. ఈ పథకం యొక్క విధివిధానాలను గ్రామసభల ద్వారా ప్రజలకు, ఉపాధి కూలీలకు, రైతులకు, మహిళలకు వివరించారు. రైతు సేవా కేంద్రాల ద్వారా శ్రామికులకు కార్యక్రమ లైవ్ టెలికాస్ట్ ను వినిపించారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి సభ్యులు ఉమేష్, మండల సింగల్ విండో అధ్యక్షులు శ్రీ కుమార్ స్వామి తదితరులు పాల్గొన్నారు.