రొళ్ల కొండ అటవీ ప్రాంతంలో ఘనంగా వన్యప్రాణి వారోత్సవాలు
శ్రీసత్యసాయి జిల్లా రొళ్ల కొండ అటవీ ప్రాంతంలో వన్యప్రాణి వారోత్సవాలు అరణ్యాధికారి సంజీవ్ రాయుడు ఆధ్వర్యంలో శనివారం గ్రామ ప్రజల సమక్షంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా, ప్రతి ఒక్కరూ వన్యప్రాణులకు హాని కలిగించకుండా, వాటికి దూరంగా ఉండాలని, వాటి జోలికి వెళ్లకూడదని సూచించారు.