తాగునీటి కోసం మహిళల ఆందోళన: హైవే దిగ్బంధం, కార్యాలయ ముట్టడి హెచ్చరిక
సత్య సాయి జిల్లా అగళి మండలం కురుసాంగనహల్లి గ్రామంలో గత కొన్ని రోజులుగా తాగునీరు అందక మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పరిస్థితిలో మార్పు రాలేదు. వెంటనే స్పందించి గ్రామానికి తాగునీరు అందించాలని, లేదంటే నేషనల్ హైవేపై భారీ ధర్నా చేపడతామని, మండల కార్యాలయాన్ని ముట్టడిస్తామని గ్రామ మహిళలు హెచ్చరించారు. ఈ సమస్యపై తక్షణ చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.