డాక్టర్ వైయస్సార్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండల కేంద్రంలోని వైయస్సార్ జంక్షన్ వద్ద వైయస్సార్ విగ్రహానికి పూలమాలవేసి బుధవారం నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి జిల్లా ఉపాధ్యక్షులు విశ్వనాథ్ రెడ్డి, మండల కన్వీనర్ గంగాధర్, రాయప్ప, వడ్డి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. వైయస్సార్
కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొని దివంగత ముఖ్యమంత్రికి ఘనంగా నివాళులర్పించారు.