పెనుగొండ పట్టణంలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ సూచనల మేరకు 172, 151, 150, 168 బూత్‌లలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (SIR) కార్యక్రమాన్ని
టీడీపీ నాయకులు పరిశీలించారు. ఇంటింటికీ ఎన్యూమరేషన్ ఫారం (EF) నమోదు ప్రక్రియను పర్యవేక్షించి, జూలై 14లోపు ప్రతి ఓటరు ఫారాన్ని BLOకు సమర్పించాలని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సతీష్ కుమార్,
టీడీపీ అర్బన్ కన్వీనర్ శ్రీరాములు, పార్టీ పరిశీలకులు తదితరులు పాల్గొన్నారు.