శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మండలంలోని అమ్మవారిపల్లిలో 44వ జాతీయ రహదారిపై పోలీస్ స్టేషన్ వద్ద ద్విచక్రవాహనం అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో చెన్నేకొత్తపల్లి గ్రామానికి చెందిన బొగ్గు నరసింహులు (60) అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి, క్షతగాత్రుడిని రహదారి అంబులెన్స్‌లో పెనుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అయితే, వైద్యులు పరీక్షించగా అప్పటికే ఆయన మృతి చెందినట్లు నిర్ధారించారు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు.