పెనుకొండ: జాతీయ రహదారి పై యువకులు బైక్ స్టంట్...

1047చూసినవారు
శ్రీసత్య సాయి జిల్లా పెనుకొండ పట్టణంలో బాబాయ్య స్వామి గంధం వేడుకల సందర్భంగా బుధవారం 44వ జాతీయ రహదారిపై కొందరు యువకులు పోలీసుల ముందే బైక్ స్టంట్లు ప్రదర్శించారు. దీనివల్ల తోటి వాహనదారులకు ఇబ్బందులు తలెత్తాయి. వేగంగా వస్తున్న వాహనదారులకు అడ్డుగా బైక్ విన్యాసాలు చేయడంతో వారు భయాందోళనకు గురయ్యారు. దీంతో పోలీసులు స్పందించి, బైక్ స్టంట్లు చేసిన యువకులపై చర్యలు తీసుకున్నారు. వారి బైకులను సీజ్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.