మహదేవపల్లిలో మంత్రి సవితను గజమాలతో సత్కరించిన రవీంద్ర

2చూసినవారు
మహదేవపల్లిలో మంత్రి సవితను గజమాలతో సత్కరించిన రవీంద్ర
పెనుకొండ మండలం మహదేవపల్లిలో మంత్రి సవితకు ఘన స్వాగతం లభించింది. రవీంద్ర ఆధ్వర్యంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మంత్రి సవితను గజమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా రవీంద్ర మాట్లాడుతూ. మంత్రి సవితకు మహదేవపల్లి ప్రజల తరఫున ఘన స్వాగతం పలకడం ఆనందంగా ఉందన్నారు. గ్రామ ప్రజల అభిమానం, కార్యకర్తల ఉత్సాహం కార్యక్రమంలో స్పష్టంగా కనిపించిందన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న మంత్రి సవితకు తమ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. మంత్రి సవిత రాకతో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొంది.

సంబంధిత పోస్ట్