ఓబులదేవర చెరువులో రోడ్డు ప్రమాదం

2835చూసినవారు
ఓబులదేవర చెరువులో రోడ్డు ప్రమాదం
ఓబులదేవర చెరువులోని కస్తూర్బా పాఠశాల వెనుక నేషనల్ హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో, టూ వీలర్‌పై డీజిల్ తీసుకెళ్తున్న విద్యార్థి శశాంత్ రెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు. కదిరి నుంచి హిందూపురం వైపు వెళ్తున్న టాటా ఏస్ వాహనం, ఓడీసీ నుంచి సొంత ఊరికి డీజిల్ తీసుకెళ్తున్న శశాంత్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శశాంత్ రెడ్డికి రెండు కాళ్లకు తీవ్ర గాయాలవడంతో, స్థానికులు అతన్ని అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్