ఏపీ చేనేత జౌళి శాఖ మంత్రి సవిత, శనివారం రొద్దం మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా రొద్దం మండలం నుంచి హిందూపురం వెళ్లే ఆర్టీసీ బస్సులో మహిళలతో కలిసి ప్రయాణించారు. మహిళా ప్రయాణికులతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ లో భాగంగా ఇచ్చిన స్త్రీ శక్తి పథకం గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం కండక్టర్ ను అడిగి జీరో టికెట్ తీసుకున్నారు.