గోరంట్ల 2వ వార్డులో మురుగునీటి సమస్య.. తీవ్ర ఇబ్బందుల్లో ప్రజలు

2చూసినవారు
గోరంట్ల 2వ వార్డులో మురుగునీటి సమస్య.. తీవ్ర ఇబ్బందుల్లో ప్రజలు
గోరంట్ల పట్టణంలోని 2వ వార్డు, మదీనా మసీదు వెనుక భాగంలో శాంతి నికేతన్ స్కూల్ సమీపంలో కొందరు మురికి కాలువను మూసివేయడంతో మురుగునీరు వెళ్లే మార్గం లేక నిలిచిపోతోంది. ఈ ప్రాంతంలో సుమారు 300 నుంచి 400 కుటుంబాలు నివసిస్తున్నాయి. మురుగునీరు నిల్వ ఉండటంతో దుర్వాసన, దోమల బెడద పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంటువ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కావున జిల్లా కలెక్టర్, RDO, MPDO, తహసీల్దార్, పంచాయతీ కార్యదర్శి, జిల్లా పంచాయతీ అధికారి, స్థానిక ఎమ్మెల్యే, ఎంపీలు తక్షణమే స్పందించి చర్యలు తీసుకొవాలని స్థానికులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్