సోమందేపల్లి శివాలయంలో విచిత్ర సంఘటన..

978చూసినవారు
శ్రీసత్య సాయి జిల్లా సోమందేపల్లి మండల కేంద్రంలోని సంత మార్కెట్ రోడ్డులోని పురాతన శివాలయంలో ఒక విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. శనివారం శివలింగం వెనుక పాము పడగ లాంటి నీడ కనిపించడంతో భక్తులు భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తున్నారు. ఉదయం గుర్తుతెలియని నాగ సాధువు పూజ చేసి వెళ్లిన తర్వాత ఈ దృశ్యం ఆవిష్కృతమైందని భక్తులు తెలిపారు. ఈ సంఘటన భక్తులలో ఆశ్చర్యాన్ని, భక్తి భావాన్ని కలిగించింది.