పోలియో చుక్కలు వేసిన తెదేపా, జనసేన నాయకులు

2316చూసినవారు
పోలియో చుక్కలు వేసిన తెదేపా, జనసేన నాయకులు
సోమందేపల్లి మండలకేంద్రంలోని రాంబాబుకాలనీలో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా బ్రాహ్మణపల్లి తెదేపా నాయకుడు ఇర్ఫాన్ ఖాన్, రాంబాబుకాలనీ తెదేపా యువ నాయకుడు మన్సూర్, జనసేన నాయకుడు విశ్వనాథ్ చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ కార్యక్రమంలో ఓబులేసు, వినోద్, మురళి కూడా పాల్గొన్నారు. చిన్నారుల బంగారు భవితకు, ఆరోగ్యకరమైన జీవితానికి ఈ రెండు చుక్కలు ఎంతో కీలకమని ఈ సందర్భంగా నాయకులు తెలిపారు.

సంబంధిత పోస్ట్