కొండ గుహలో దుండగుల హల్చల్

7చూసినవారు
కొండ గుహలో దుండగుల హల్చల్
సోమందేపల్లిలోని అక్కమ్మ గార్ల కొండ గుహలో దొంగలు కలకలం సృష్టించారు. బుధవారం ఉదయం పూజారి కొండపైకి వెళ్లి చూడగా, గుహ గోడను బద్దలు కొట్టినట్లు గుర్తించారు. స్థానికులు గుప్తనిధుల కోసమే ఈ అకృత్యానికి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. గుహలోకి ఎవరూ వెళ్లకుండా అడ్డుగా కట్టిన గోడను పగులగొట్టి దుండగులు లోపలికి ప్రవేశించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

సంబంధిత పోస్ట్