సోమందేపల్లి మండలం మండ్లి నుంచి ముద్దపుకుంటకు వెళ్లే కిలోమీటరు రహదారి గుంతలమయంగా మారి వాహనదారులకు నరకం చూపిస్తుంది. ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. రోడ్డుపై కంకర తేలి అధ్వాన్నంగా మారడంతో ద్విచక్ర వాహనదారులు తరచూ ప్రమాదాల బారిన పడుతున్నారు. అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాలకులు వెంటనే స్పందించి రహదారి మరమ్మతులు చేపట్టాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.