2025 క్రైమ్ రిపోర్టు: హత్యలు 54, కిడ్నాప్‌లు 25

477చూసినవారు
2025 క్రైమ్ రిపోర్టు: హత్యలు 54, కిడ్నాప్‌లు 25
శ్రీ సత్యసాయి జిల్లాలో 2025లో మొత్తం 4,028 కేసులు నమోదయ్యాయని ఎస్పీ సతీశ్ కుమార్ తెలిపారు. గతేడాదితో పోలిస్తే నేరాలు 2 శాతం పెరిగాయని చెప్పారు. రోడ్డు ప్రమాద మరణాలు 340 నుంచి 303కు తగ్గాయి. హత్యలు 54, కిడ్నాప్‌లు 25గా నమోదయ్యాయి. మహిళలపై నేరాలు 26.3 శాతం పెరిగాయి. ఈ-చలాన్ల ద్వారా రూ.1.01 కోట్ల జరిమానా వసూలు చేశారు. హిందూపురం బ్యాంకు చోరీ కేసులో రూ.5.5 కోట్ల బంగారాన్ని పోలీసులు <<18718838>>రికవరీ<<>> చేశారు.