అమడగూరు మండలం పూలకుంట్లపల్లిలో బుధవారం ఉదయం 11 గంటలకు మండల రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను MLA పల్లె సింధూర చేతుల మీదుగా పంపిణీ చేస్తున్నట్లు MLA క్యాంపు కార్యాలయం ప్రతినిధులు తెలిపారు. స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.